Monday, 20 November 2017

ఉద్యోగుల వైద్య ఖర్చులకు పరిమితి లేదు💰వైద్య ఖర్చులకు పరిమితి లేదు
🔺వెల్నెస్సెంటర్లలో సకల సౌకర్యాలు ప్రస్తుతం రోజూ 1500 మందికి

💠ఓపీ సేవలు అత్యవసరమైతే నేరుగా కార్పొరేట్ఆస్పత్రుల్లో చేరొచ్చు

🏥త్వరలో జిల్లా కేంద్రాల్లో వెల్నెస్సెంటర్లు

🎙ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సీఈవో కల్వకుంట్ల పద్మ

🏥ఉద్యోగులు, జర్నలిస్టులు.. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్సెంటర్లు సరికొత్త ఒరవడితో ముందుకు సాగుతున్నాయి. రోజూ 1500 మంది అవుట్పేషంట్లకు చికిత్సలు అందిస్తూనే... ప్రైవేట్, కార్పొరేట్ఆస్పత్రుల ద్వారా అత్యవసర వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాయి. అవయవ మార్పిడి వంటి శస్త్రచికత్సలకు సైతం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నాయి. ఈహెచ్ఎస్, జెహెచ్ఎస్ అమలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్టర్కల్వకుంట్ల పద్మ ను సీఈవోగా నియమించింది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన ఆమె.. వెల్నెస్సెంటర్ల పనితీరుపై ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ఈహెచ్ఎ్, జెహెచ్ఎ్ స్కీమ్‌లో ఎంత మంది సభ్యులున్నార?

🔷12 లక్షల మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది ఓపీ సేవలు వినియోగించుకున్నారు. 1.70 లక్షల మంది ఐపీ సేవలు పొందారు.

నెట్‌వర్క్‌లో ఎన్ని ఆస్పత్రులు ఉన్నాయి?

🔷ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, కార్పొరేట్, ప్రైవేట్ఆస్పత్రులను అనుసంధానం చేసి వైద్య చికిత్సలు అందిస్తున్నాం. నెట్‌వర్క్‌లో 269 ప్రైవేట్, 65 ప్రభుత్వ, 65 డెంటల్, 18 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి.

వెల్నెస్సెంటర్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి..?

🔷ఖైరతాబాద్, వనస్థలిపురం సెంటర్లలో రోజూ ఓపీ ఉంటుంది. సెంటర్లలో 19 ప్రత్యేక విభాగాల ద్వారా రోజూ 1500 మందికి సేవలు అందిస్తున్నాం. ల్యాబ్, ఈసీజీ, 2డీ ఎకో, అలా్ట్ర సౌండ్, ఫిజియోథెరపీ సదుపాయాలున్నాయి.

రోగికి అత్యవసర చికిత్స అవసరమైతే ఎల?

🔷రోడ్డు ప్రమాదాలు, బ్రెయిన్‌స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల కేసులకు సంబంధించిన వారు నేరుగా కార్పొరేట్, ప్రైవేట్‌ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు. సభ్యుల వివరాలు ఆయా ఆస్పత్రుల సిబ్బంది ఆన్‌లైన్‌ద్వారా మాకు పంపిస్తారు. అత్యవసరంగా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వస్తే ఆస్పత్రి సిబ్బంది ద్వారా ఫోన్సమాచారం అందిస్తే సరిపోతుంది.

అవయవ మార్పిడి చికిత్సకు అవకాశముంద?

🔷అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు చొరవ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇద్దరికి గుండె సంబంధిత ఆపరేషన్లు, 10 మందికి మూత్ర పిండాలు, 50 మందికి నేత్ర, 10 మందికి బోన్‌మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్శస్త్రచికిత్సలు కార్పొరేట్ఆస్పత్రుల్లో చేయించాం.

అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయా?

🔷300 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉన్నాయి. వెల్నెస్సెంటర్లో సూచించిన మందులతోపాటు కార్పొరేట్, ప్రైవేట్ఆస్పత్రుల్లో రాసిన మందులను పంపిణీ చేస్తున్నాం.

కొత్తగా ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు..?

🔷తెలంగాణలోని పాత జిల్లాల్లో 14 సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం రెండు సెంటర్లలో సేవలు అందిస్తున్నాం. కూకట్పల్లి, పాతబస్తీ, సంగారెడ్డి, వరంగల్‌లో సెంటర్లు సిద్ధమయ్యాయి.

ప్రైవేట్ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల పరిమితి ఉందా...?

🔷పరిమితి లేదు. రోగి అవసరాన్ని బట్టి ఎంత ఖర్చు అయితే అంత భరిస్తాం. అయితే రోగి వైద్య ఖర్చుల్లో 2, 5, 7, 10 లక్షలు... ఇలా కొన్ని చోట్ల చెక్పాయుంట్లు ఉంటాయి. రోగికి అందిస్తున్న చికిత్స, ఎంత ఖర్చు అవుతుంది వంటి సమాచారంతోపాటు ఎంత వరకు అవసరమో గమనిస్తాం.

కొత్త ఆలోచనాలు ఏమైనా..?

🔰ఓపీ కోసం వచ్చే వారు ఎక్కువ సేపు నిరీక్షించకుండా బయోమెట్రిక్విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నాం. మీట నొక్కగానే అందులో ఆయా విభాగాలకు సంబంధించిన ఓపీ వివరాలు వస్తాయి. అందులో తమకు కావాల్సిన విభాగంపై ప్రెస్చేస్తే రోగికి టోకెన్నంబర్వస్తుంది.

ఇంకా... రోగులకు ఎలాంటి సేవలు అందించనున్నారు.?

🔷ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సభ్యులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య వివరాలు సేకరించి, ఆన్లైన్రిజిస్ట్రేషన్చేసే విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు, జబ్బులు, సమస్యలు నమోదు చేసి ఉండడం వల్ల వారు చికిత్సల కోసం వచ్చినపుడు సులువు అవుతుంది. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహకారంతో వెల్నెస్సెంటర్లను మరింత అభివృద్ధి చేసి మెరుగైన వైద్యం అందిస్తాం.

సభ్యులకు మీరు ఇచ్చే సలహాలు...?

🔷ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సభ్యులు తప్పని సరిగ్గా తమ హెల్త్‌కార్డును అందుబాటులో ఉంచుకోవాలి. హెల్త్‌కార్డు నంబర్అందుబాటులో ఉంటే సభ్యులు, వారి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ఆలస్యం చేయకుండా చికిత్స అందించడానికి అవకాశముంటుంది. సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా, ఆస్పత్రిలోనైనా వైద్య సేవలు పొందే సదుపాయం అందుబాటులో ఉంది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS