Friday, 17 November 2017

ఇక మీ ఇంటి పోస్టల్ అడ్రస్ మారిపోతుంది



🌻 Digital లావాదేవీల మీద ఇంత కాలం దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలకమైన రంగాన్ని డిజిటలైజ్ చెయ్యడానికి పూనుకుంది. అదే ఇంటి అడ్రస్‌లు.

🌻 మీ ఇంటి అడ్రస్ రాయమని చెప్తే ఒక్కొకరు నాలుగైదు లైన్లు రాయక తప్పని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అలా కాకుండా దేశంలోని ప్రతీ ఇంటికీ ఓ చిన్న కోడ్ ఇస్తే, ఆ కోడ్ ఆధారంగా ఆ ఇంటిని సులభంగా పట్టుకోగలిగితే? చాలా కాలంగా Zippr వంటి సంస్థలు అందిస్తున్న smart address లను ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది.

🌻 ఈ మేరకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పోస్టల్ శాఖ MapmyIndia సంస్థ సహకారంతో ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో ఉన్న ఏ ఇంటి అడ్రస్‌నైనా క్లుప్తీకరించి దాన్ని eLoc గా కేవలం ఆరు అక్షరాల రూపంలోకి ఇది మార్చేస్తుంది. అంటే UV3741 అనేది ఓ అడ్రస్.

🌻 కొరియర్ పార్శిళ్ల మీదా దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఇంటి ముందూ దీన్ని తగిలిస్తారు. విజిటింగ్ కార్డులు, ఇంకా ఇతర ప్రదేశాల్లో ఇలాంటి అడ్రస్‌ని వాడుకోవచ్చు. వివిధ ఆస్థులను యజమానులతో లింక్ చెయ్యడానికీ, ఇతర అధికారిక అవసరాలకు కూడా ఈ eLoc ని ప్రభుత్వం వాడబోతోంది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS