Monday, 27 November 2017

పేరు మారినా.. తీరు మారలేదు



*📚పేరు మారినా.. తీరు మారలేదు !️📚*

*విద్యా ప్రణాళిక అమలుకు సీఆర్పీల వ్యవస్థ*

*ఎమ్మార్సీ విధులకే పరిమితం*

🌻 విద్యాశాఖ కార్యక్రమాలు, ప్రణాళికలు విజయవంతం కావాలంటే పాఠశాలలను, జిల్లా విద్యాశాఖను సమన్వయపరిచేందుకు క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌ (సీఆర్పీ) వ్యవస్థను నెలకొల్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013లో పాఠశాలల సముదాయాల ఏర్పాటుతో పాటు ఈ వ్యవస్థ కూడా అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 295 మంది క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌లు ఉండాల్సి ఉండగా 282 మంది పని చేస్తున్నారు. వివిధ కారణాలతో 13 ఖాళీలు ఉన్నాయి.

🌻 గతంలో విద్యాశాఖలో మండల రిసోర్సు పర్సన్‌ల వ్యవస్థ మండల వనరుల కేంద్రంలో ఉండేది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల్లో వినియోగించరాదనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పూర్తిగా ఈ వ్యవస్థను రద్దు చేశారు. క్షేత్రస్థాయిలో విద్యా కార్యక్రమాల అమలుకు 2013 నుంచి సీఆర్పీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

*ఎస్‌ఎస్‌ఏ అధీనంలోనే..:*

🔹 ఉద్యోగి నియామకం నుంచి జీతభత్యాల చెల్లింపు వరకు సర్వశిక్ష అభియాన్‌ అధీనంలోనే పూర్తిగా సీఆర్పీ వ్యవస్థ పని చేస్తోంది. ప్రాజెక్టు అధికారి ఆదేశాలతో కార్యక్రమాలు అమలు చేయాలి.

🔹 ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వీరికి జీతభత్యాలను పెంచింది. దాంతో వీరి బాధ్యతలు మరింత పెరిగాయి.

*ప్రస్తుత పరిస్థితి:*

🔹 సిఆర్పీలు పూర్తిగా ఆయా కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ రూపొందించే అనేక కార్యక్రమాలకు ఎక్కువగా మండల వనరుల కేంద్రంలోనే వారు పనిచేయాల్సి వస్తోంది. జిల్లా విద్యాశాఖ రోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తుంది. దాని లక్ష్యాలు సాధించాలంటే పాఠశాలలకు, కార్యాలయానికి సకాలంలో సమాచారాన్ని అందించడానికి సీఆర్పీలు అందుబాటులో ఉండాలి.

🔹 ఏకోపాధ్యాయ పాఠశాలలు, శిక్షణలకు తరచూ హాజరయ్యే ఉపాధ్యాయుల స్థానంలో డిప్యూటేషన్‌లకు కూడా వినియోగిస్తున్నందున ఈ వ్యవస్థ అసలు లక్ష్యాలు నెరవేరడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

*సిఆర్పీల బాధ్యతలివి...*

🔹 క్లస్టర్‌ పరిధిలో పాఠశాలలన్నింటిని నెలలో ఒక సారైనా పరిశీలించి ప్రార్థన సమయం నుంచి ముగింపు సమయం వరకు ఉండాలి.

🔹 ప్రతి పాఠశాలకు సంబంధించిన గ్రేడ్‌లు, విద్యార్థుల వివరాలు, ఎప్పటికప్పుడు అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేయడం వంటివి చేయాలి.

🔹 సముదాయ సమావేశాల వివరాలు ఉపాధ్యాయులకు తెలియజేయాలి. స్కూల్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలి.

🔹 ఆవాస ప్రాంతంలోని 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరిని బడిలో చేర్పించి బడి బయట విద్యార్థులు లేకుండా చేయడం ప్రథమ కర్తవ్యం.

🔹 ఎస్‌ఎంసీ సమావేశాలు ఏర్పాటు చేసి అందరూ హాజరయ్యేలా కృషి చేయాలి.

🔹 వీటితో పాటు మరికొన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

*సిఆర్పీలదే ప్రధాన భూమిక*

🔹 పాఠశాలలకు, మండల రిసోర్సు కేంద్రానికి, జిల్లా విద్యాశాఖకు సమాచారాన్ని సేకరించి, అందించడంలో సీఆర్పీలదే ప్రధాన భూమిక. క్లస్టర్‌ పరిధిలో ఉన్న సమాచారాన్ని స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ద్వారా ఎంఈవోకు అందిస్తూ ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎంఈవో ద్వారా అందజేయాలి.

🔹 ఉపాధ్యాయులు సెలవు లేదా ఏదో ఒక కారణంతో వెళ్లినప్పుడు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాగే క్లస్టర్‌ పరిధిలో బడి బయట పిల్లలను బడిలో చేర్పించడానికి కృషి చేయాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS