Saturday, 25 November 2017

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పిల్లలు కూడా సర్కారు బడుల్లోనే…



💥 అధికారుల పిల్లలూ వాటిలోనే చదవాలి 💥
💥 కర్ణాటక శాసనసభలో కీలక బిల్లు 💥
💥 ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అమలు 💥

👉 ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించడంతోపాటు, గుణాత్మకమైన విద్య అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పిల్లలు కూడా సర్కారు బడుల్లోనే చదవాలనే నిబంధనను విధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఈ బిల్లు మరో రెండు రోజుల్లో విధానపరిషత్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. శాసనసభ, పరిషత్‌లలో దీనికి అంగీకారం లభిస్తే ఇకపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాల్సి ఉంటుంది.
👉 ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి చట్టం కార్యరూపం దాల్చి విజయవంతంగా అమలవుతోంది.
👉 దాని తర్వాత ఇటువంటి నిబంధన అమలులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న రెండో రాష్ట్రం కర్ణాటక. ఈ బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా, తాలూకా, పట్టణ, నగరసభల కౌన్సిలర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌, కేఏఎస్‌ అధికారుల పిల్లలు ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాల్సి ఉంటుంది. పరిషత్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రఘు ఆచార్‌ సభాపతి శంకరమూర్తి నుంచి అనుమతి పొందారు. మరో రెండు రోజులు మాత్రమే శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున గురు, శుక్రవారాలలో బిల్లు సభ ముందుకు రానుంది. పరిషత్‌లో చర్చలు జరిగాక అంగీకారమైతే శాసనసభకు పంపుతారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందుతారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS