Wednesday, 22 November 2017

భారత తొలి మహిళా డాక్టర్‌కు గూగుల్ నివాళి



👉 మీరు ఈ రోజు గూగుల్‌ని గమనించి ఉంటేగూగుల్ తన డూడుల్ అంటే గూగుల్ వెబ్‌సైట్ హోంపేజీ లో వచ్చే లోగోలో సెతస్కోప్ వేసుకున్న మహిళఆస్పత్రిలో పడకల చుట్టూ ఉన్న పడకల్లో మహిళా రోగులు మరియు నర్సుల సేవలు కనిపిస్తాయిగూగుల్ డూడుల్‌లో ఉన్న మహిళా వైద్యురాలే డాక్టర్ రుక్మాబాయి రౌత్ ఆమెను రఖ్మబాయి రౌత్ లేదా రుక్మబాయి అని కూడా పిలుస్తారు. 

👉 బ్రిటీష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా వైద్యురాలైన రుక్మాబాయితన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనినిలబడి మహిళా వైద్యురాలిగా ఎన్నో సేవలు అందించారుఅందుకే 1864 నవంబర్ 22న జన్మించిన రుక్మాబాయి జయంతిని పురస్కరించుకుని గూగుల్ ఘనంగా నివాళులర్పించింది.

👉 రక్మాబాయి రౌత్ నవంబరు 22, 1864 న ముంబైలో జన్మించారురుక్మాబాయి జీవితం బాల్యం నుంచీ ముళ్లపై ప్రయాణమేచిన్నతనంలోనే (11 ఏళ్ల వయస్సులోనే) పెంళ్లిఆ తర్వాత విడాకులు ఆమెను వెంటాడి వేధించాయి.

👉 రుక్మాబాయి వాళ్లమ్మది కూడా బాల్య వివాహమే. 14 ఏళ్లకే పెళ్లి… 15 ఏళ్లకు రుక్మాబాయి జననం… 17 ఏళ్లకే ఆమె వితంతువుగా మారిపోయింది. భర్త చనిపోవడంతో ఆమె వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. ఆయనో డాక్టర్కూతురుకి కూడా బాల్య వివాహమే జరిపించింది.

👉 చిన్నతనంలోనే సూక్ష్మ ఆలోచనా నైపుణ్యం కలిగిన రుక్మాబాయి తల్లి పడే కష్టాలనుతన కష్టాలను అర్థం చేసుకొని స్వతంత్ర భావాలను ఏర్పరచుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తతో ఉండనని చెప్పేసింది. భార్యాభర్తలిద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.. న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించడం ఆమె జీవితాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశాయిన్యాయపోరాటం చేసి గెలిచిన ఆమెవివాహం చేసుకోకూడదని ఆమె కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. రుక్మాబాయి తన పినతండ్రి సలహాతో లండన్ వెళ్లిపోయిబాంబే కామా హాస్పిటల్ బ్రిటీష్ డైరెక్టర్ ఎడిత్ పెచ్చే ఫిప్‌సన్ సహకారంతో 1889లో లండన్‌లో మెడిసిన్ చేసితన 35 ఏళ్ల వయస్సులో మెడిసిన్ పూర్తిచేసి ఇండియాకు తిరిగి వచ్చి వైద్య సేవలు అందించింది ఆమెఅంతటితో ఆగకుండా…. ఒక సాంఘిక సంస్కర్తగా సేవలు అందిస్తూబాల్య వివాహాలకు వ్యతిరేకంగాఒంటరి మహిళల కష్టాలపై ఎన్నో రచనలు చేశారు.

👉 రుక్మాబాయి 91 ఏళ్ల వయస్సులో 25 సెప్టెంబర్ 1991లో కన్నుమూసేవరకు సామాజిక కార్యకర్తగా క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS