Tuesday, 21 November 2017

ఆధార్‌ సమాచారం భద్రం...సురక్షితం



👇👇 ఆధార్‌ సమాచారం భద్రం...సురక్షితం 👇👇

👉 ఆధార్‌ కోసం దేశ ప్రజల నుంచి సేకరించిన సమాచారం భద్రంగా, సురక్షితంగా ఉందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) తెలిపింది. ఆధార్‌ సంఖ్య రహస్యమైనదికాదని పేర్కొంది.

👉 వివిధ సంస్థల సేవలు/ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్న వారు ఆ సంఖ్యను తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

👉 210 ప్రభుత్వ వెబ్‌సైట్లు ఆధార్‌ సమాచారాన్ని వెల్లడించాయంటూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌కు స్పందిస్తూ ఉడాయ్‌ ఈ వివరణ ఇచ్చింది. తమ సర్వర్‌ నుంచి గానీ, సమాచారనిధి(డేటా బేస్‌) నుంచి గానీ ఆధార్‌ వివరాలు బహిర్గతం కాలేదని తెలిపింది.*

🌀 అయితే, విద్యా సంస్థలు సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పారదర్శకతలో భాగంగా లబ్ధిదారుల ఆధార్‌, పేర్లు, చిరునామాలను వెల్లడించాయని పేర్కొంది. దానిని లీకేజీగా భావించరాదని, సమాచారమిచ్చే విధానంలోని లోపాలను సరిచేశామని తెలిపింది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS