Monday, 20 November 2017

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం



*🛑నేడు "అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం"*

🌀నవంబర్ నెల అనగానే బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు, బాలల హక్కుల దినోత్సవం... ఇలా నెల మొత్తంమీదా బాలలకు పండుగ రోజులే..!

🌀ఇందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, ప్రపంచ బాలల దినోత్సవాన్ని పిల్లలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

🌀1959 సంవత్సరం నవంబర్ 20 తేదీన బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా ప్రపంచమంతటా బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటుంటారు.

🌀ఇదే రోజునే బాలల హక్కుల దినోత్సవంగా కూడా పాటిస్తున్నారు.పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకుగాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది.

🌀ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం దినోత్సవం లక్ష్యం.

🌀బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్ను స్థాపించింది.

🌀మానవతా దృక్పధంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

🌀బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది.కేవలం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు బాలల కోసం ప్రత్యేకంగా స్థాపించబడి వారి ఉన్నతికి కృషి చేస్తున్నాయి.

🌀ఇదిలా ఉంటే.. బాలల హక్కులు ప్రాధమిక హక్కుగా చేసినప్పటికీ వారి హక్కులు కాపాడ్డం అనేది కేవలం అచరణ సాధ్యంకాని పనిగా కనిపిస్తోంది.

🌀బాలల హక్కులపై ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న స్వచ్చంద సంస్ధలు బాలలను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయలు స్వదేశి, విదేశి నిధులు దుర్వినియోగపరుస్తున్నారే తప్ప వీరి హక్కులు కాపాడేందుకు ఒక్కరూ చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేయడం లేదనే అరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.

🌀బాల కార్మిక చట్టాలు, బాలల హక్కుల చట్టాలు కొంత మందికి చుట్టంగానే కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

🌀ముఖ్యంగా బాలలు ఎక్కువగా ప్రమాదకరమైన పనుల్లో కనిపించడం అలా పనుల్లో పెట్టుకున్న వారిపై కేసుల నమోదులు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS