Friday, 17 November 2017

ఉద్యోగంలో కొనసాగకుంటే పీఎఫ్‌ వడ్డీపై ఆదాయపు పన్ను



*🌐ఉద్యోగంలో కొనసాగకుంటే పీఎఫ్‌ వడ్డీపై ఆదాయపు పన్ను🌐*
*ఉద్యోగంలో ఉన్నన్నాళ్లే పీఎఫ్‌ వడ్డీకి ఊరట*
*ఐటీ ట్రైబ్యునల్‌ కీలక రూలింగ్‌*
🌻ఉద్యోగ విరమణ లేదా ఇతరత్రా కారణాలతో జాబ్‌కు స్వస్తి చెప్పిన వారూ.. మీకు పన్ను పోటు పొంచి ఉన్న విషయాన్ని గమనించాల్సిన సమయం వచ్చింది. భవిష్య నిధి(పీఎ్‌ఫ)లో దాచుకున్న సొమ్ముపై వచ్చే వడ్డీ ఈ పన్ను పోటుకు కారణమవబోతోంది.
🌻 ఉద్యోగం నుంచి మానేసిన తర్వాతా పీఎఫ్‌ వడ్డీ వస్తే దానిపై కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ బెంగళూరు బెంచ్‌ తాజాగా తీర్పు చెప్పింది.
🌻ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు మాత్రమే పీఎఫ్‌ నిల్వపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుందని, ఆ తర్వాత పన్ను కట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన, రాజీనామా చేసిన, రిటైరైన ఉద్యోగులు అందరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 26 ఏళ్లపాటు పనిచేసిన ఓ ఉద్యోగి 2002 ఏప్రిల్‌ 1న రిటైరయ్యారు.
🌻ఆ రోజుకు ఆయన పీఎఫ్‌ ఖాతా నిల్వ రూ.37.93 లక్షలు ఉంది. దానిని 9 ఏళ్ల పాటు అలాగే ఉంచేశారు. 2011 ఏప్రిల్‌ 11 నాటికి వడ్డీతో కలిపి ఆ మొత్తం దాదాపు రూ.82 లక్షలకు చేరింది. సుమారు రూ.44 లక్షల మేర వడ్డీ జమ అయ్యింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు మాదిరే ఆ వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుందని భావించిన సదరు రిటైర్డ్‌ ఉద్యోగి, దానిపై ఎలాంటి పన్నూ చెల్లించలేదు. కానీ ఐటీ అధికారులు తాఖీదు పంపారు.
🌻ఆ తర్వాత కేసు ట్రైబ్యునల్‌కు చేరింది. ఆదాయపు పన్ను సెక్షన్‌ 10(12) కింద పీఎఫ్‌ వడ్డీకి లభించే మినహాయింపు ఉద్యోగంలో ఉన్నన్నాళ్లే వర్తిస్తుందని, ఉద్యోగం మానేశాక లేదా రిటైరయ్యాక మినహాయింపు ఉండదని ట్రైబ్యునల్‌ రూలింగ్‌ ఇచ్చింది. అంటే ఉద్యోగం చేయడం మానేసిన తర్వాత కూడా భవిష్యత్‌ అవసరాల కోసం పీఎఫ్‌ సొమ్మును విత్‌డ్రా చేయకుండా దాచి ఉంచుకుందామనుకుంటే ఇక పన్ను పోటు తప్పదన్నట్లే!

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS