Wednesday, 15 November 2017

టీఆర్‌టీ నియామక ప్రక్రియను మాత్రం నిలిపివేయొద్దు



👇👇 టీఆర్టీ నియామక ప్రక్రియను మాత్రం నిలిపివేయొద్దు 👇👇
👉 పిటిషనర్లు గెలిస్తే పది జిల్లాలే ప్రాతిపదిక
👉 హైకోర్టుకు సర్కారు అభ్యర్థన
👉 అఫిడవిట్దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

👉టీఆర్టీ నోటిఫికేషన్కేసులో పిటిషనర్లు గెలిస్తే పది జిల్లాల ప్రాతిపదికనే నియామకాలు చేపడతామని తెలంగాణ సర్కారు ఉమ్మడి హైకోర్టుకు తెలియజేసింది. నియామక ప్రక్రియను మాత్రం నిలిపివేయొద్దని అభ్యర్థించింది. 31 జిల్లాల ప్రాతిపదికన టీఆర్టీ నోటిఫికేషన్ఇవ్వడాన్ని సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా మంగళవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్దేశాయి ప్రకాశ్రెడ్డి మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్రమేష్రంగనాథన్, జస్టిస్అభినంద్కుమార్షావిలిల ధర్మాసనానికి విన్నవించారు.

👉 రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించే వరకు పాత పది జిల్లాలనే పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టాలని, 31 జిల్లాలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమేనని పిటిషనర్తరఫు న్యాయవాది రాహుల్రెడ్డి తెలిపారు. స్థానికతను 1976లోనే నిర్ధారించారని, పాత జిల్లాలకు చెందిన అభ్యర్థులు కొత్త జిల్లాలో స్థానికేతరులుగా మారుతున్నారని వివరించారు. స్పందించిన ధర్మాసనం.. దరఖాస్తులో అభ్యర్థి పాత జిల్లాల్లో జిల్లాకు చెందిన వారన్నదానిపై ప్రత్యేక కాలమ్కేటాయించారా అని ఏజీని ప్రశ్నించింది. దరఖాస్తులో అన్ని వివరాలు కోరామని, పాత జిల్లాల్లో జిల్లాకు చెందిన వారనేది గుర్తించగలరని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీఆర్టీ నోటిఫికేషన్జారీచేశామని, మార్చిలోపు ప్రక్రియ పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని ఏజీ గుర్తు చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్దాఖలు చేయడానికి గడువు కావాలని కోరడంతో ధర్మాసనం విచారణను నెల 22కు వాయిదా వేసింది. దరఖాస్తుల స్వీకరణకు నెల 30 చివరి తేదీ అని రాహుల్రెడ్డి తెలపగా.. ప్రభుత్వం కౌంటర్అఫిడవిట్దాఖలు చేసిన తర్వాత వారం రోజుల్లో వివాదాన్ని పరిష్కరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS