Friday, 17 November 2017

25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2017 నామినేషన్ల పర్వం మొదలైనది



*📚ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ మిత్రులకు 25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2017 నామినేషన్ల పర్వం మొదలైనది. అంతలోపుననే క్రింద తెలిపిన ప్రధానాంశం,  ఉపఅంశాలు మరియు ప్రత్యేకఅంశములకు సంబందించి  పాఠశాల స్తాయిలో ప్రాజెక్టుల రూపకల్పన పూర్తి చేసుకోగలరు.*
 *💧ప్రధానాంశం:* సుస్తిరాభివృధ్దికి విజ్ణానశాస్త్రం, సాంకేతిజ్ఞత మరియు నూతన ఆవిష్కరణలు (Science, Technology & Innovation for Sustainable Development)
*💧ప్రత్యేకఅంశము:-* దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యెకద్రుష్టి.
*💧 ఉపఅంశాలు:*
1) సహజవనరుల నిర్వాహణ
 (Natural Resource management)
2) ఆహారము మరియు వ్యవసాయము
(Food and Agriculture)
3) శక్తి వనరులు (Energy)
4) ఆరోగ్యము, పరిశుభ్రపరిస్థితులు మరియు పోషణ (Health, Hygiene & Nutrition)
5) జీవన శైలులు మరియు జీవనోపాదులు (Lifestyle of Livelihoods)
6) విపత్తుల నిర్వాహణ
 (Disaster Management)
7) సాంప్రదాయిక విజ్ఞాన వ్యవస్థలు (Traditional Knowledge Systems)
*💧నియమాలు:*
1) పాఠశాల పరిధిలోని 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు( బడిలో, బడి బయటి ) అందరు అర్హులే.
2) 10 నుండీ 14 సంవత్సరాల లోపు పిల్లలు జూనియర్లుగానూ, 14 నుండీ 17 సంవత్సరాల పిల్లలు సీనియర్లుగాను విభజించాలి.
3) ప్రతి గ్రూపు లో 5 గురు పిల్లలు వుండాలి. వారిలో ఒకరు లీడర్ గా వుండాలి.
4) జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి ప్రదర్శనలో గ్రూపులీడర్ మాత్రమే పాల్గొనాలి.
5) ప్రాజెక్టు ప్రదర్శనకు "8" నిమిషాల సమయమే వుంటుంది.
కనుక మిత్రులారా పాఠశాలలో యెక్కువ గ్రూపులుచేసి విద్యార్థులలో విజ్ఞానశాస్త్రంపట్ల ఆసక్తి పెంపొందించగలరు.  25వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2017 నందు ప్రాజెక్టులు ప్రదర్శించు వారు ముందుగా Online Registration చేయించాలి, www.ncsc.co.in  నందు new group Registration లో Register చేసుకోవాలి.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS