Friday, 24 November 2017

10 జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్): కడియం



హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం

 10 జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్‌ జారీచేస్తాం: కడియం శ్రీహరి

 🔷 తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను సవరించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.

🔷 రాష్ట్రంలో 31 జిల్లాల ప్రాతిపదికన మొత్తం 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి గత నెలలో టీఎస్‌పీఎస్సీ ఐదు నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలంటూ కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. నోటిఫికేషన్‌ సవరించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

🔷 పాత జిల్లాల ప్రకారమే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించింది. దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగించాలని స్పష్టం చేసింది.

🔷 హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీఎస్‌పీఎస్సీ, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు._

🔷 హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపారు. 10 జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS