Saturday, 28 October 2017

Student Police Cadets in Telangana State Government Schools



*👮సర్కారీ విద్యాసంస్థల్లో స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌*

*🍥11 జిల్లాల్లో పోలీసుశాఖతో కలిసి ప్రయోగాత్మకంగా అమలు*

*♻️ విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక సృహ పెంచేందుకు యత్నం*

*🔘ఈ విద్యాసంవత్సరం 43 బడుల్లో ప్రారంభం!*

* విద్యార్థులకు చదువుతో పాటు సేవాభావం, సామాజిక సృహను పెంపొందించేందుకు పోలీస్‌శాఖతో కలిసి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యక్రమాన్ని రూపొందించింది. సర్కారీ విద్యాసంస్థల్లో స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌(ఎస్‌పీసీ)ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలూ రూపొందించింది. ఈ విద్యాసంవత్సరం ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.*

*💠2010లో కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎస్‌పీసీ నిర్వహిస్తున్నాయి. ఎస్‌పీసీ టీములను ప్రారంభించాలని ఇప్పటికే ఎంహెచ్‌ఆర్డీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని బడుల్లోనూ ఎస్‌పీసీ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. మరోపక్క పోలీస్‌ శాఖ కూడా ఆ పనిలో నిమగమైంది. ఇప్పటికే పోలీస్‌శాఖ 11జిల్లాల పరిధిలో 43 పాఠశాలలను గుర్తించింది. ఎంపిక చేసిన వాటిలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బాగాంధీ పాఠశాలలూ ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 50మంది టీచర్లను ట్రైనర్స్‌గా ఎంపిక చేశారు. వీరికి త్వరలోనే ఐదురోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీటిని పర్యవేక్షించేందుకు కొంతమంది టీచర్లను డీజీపీ కార్యాలయంలో కొనసాగించే అవకాశమున్నది. రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.*

*🚸8,9 తరగతుల విద్యార్థులకు అవకాశం..*


*🚸ఎస్‌పీసీ ఏడు లక్ష్యాలతో ఏర్పాటు కానున్నది. దీనిలో 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. ఈ విద్యాసంవత్సరం కేవలం 8వ తరగతి విద్యార్థులకు అవకాశం ఇస్తుండగా, వచ్చే సంవత్సరం వారి ద్వారా 9వ తరగతిలోనూ ఎస్‌పీసీ కొనసాగనున్నది. ఒక్కో పాఠశాల నుంచి 44మంది విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.*

 *🔹ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక యూనిఫామ్‌ కోసం పోలీస్‌శాఖ కొలతలూ తీసుకుపోయారు. సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలి., నా కుటుంబం- నా భవిష్యత్తు, సమాజంలో పౌరుడు ఎలా ఉండాలి., నేను సమాజానికి ఏ విధంగా తోడ్పడుతాను., నా ఆరోగ్యం ఎలా ఉండాలి, ట్రాఫిక్‌, పర్యవరణం తదితర అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఎస్‌పీసీ యూనిట్లు ఉన్న బడుల్లో దీనికోసం వారంలో ప్రత్యేకంగా ఐదు పీరియెడ్లు కేటాయించనున్నారు. మూడు గంటలు ఇన్‌డోర్‌, రెండు గంటలు అవుట్‌డోర్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.*

*👮ఎస్‌పీసీకిఎంపికైన స్కూళ్లు..*

జిల్లాలు బడులు
నిజామాబాద్‌ 4
నిర్మల్‌ 4
సంగారెడ్డి 4
ఆదిలాబాద్‌ 4
వికారాబాద్‌ 3
గద్వాలజోగులాంబ 3
నల్లగొండ 4
మహబూబ్‌నగర్‌ 5
జగిత్యాల 3
కామారెడ్డి 4
హైదరాబాద్‌ 5

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS