Saturday, 28 October 2017

Honorarium of Midday Meal Workers Increased To Rs 5,000 A Month



💰 మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంపు

🔺 రూ. వెయ్యి నుంచి ఐదు వేలకు..

🔹 డిసెంబర్ నుంచి అమలు

🔶 55 వేలమందికి ప్రయోజనం

🔘 రాష్ట్రంలో మధ్యా హ్న భోజన వంట కార్మికులకు గౌరవ వేతనాన్ని భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం కార్మికులకు రూ.1,000 గౌరవ వేతనం అందుతుండగా తాజా నిర్ణయం వల్ల వారి వేతనం రూ.5,000 లకు పెరుగనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న 55 వేలమంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పెరిగిన వేతనాలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమలు చేయనున్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అందుకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయనున్నది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS