Sunday, 29 October 2017

Government Employees Medical Reimbursement and Understanding



👉 మెడికల్ రీయంబర్స్మెంట్.... అవగాహన


 👉 ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.*
👉 (G.O.Ms.No.74 తేది:15-03-2005)*

👉 ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.*
👉 (G.O.Ms.No.397 తేది:13-11-2008)*

👉 కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.*

👉 వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.*

👉 ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.*
👉 (G.O.Ms.No.68 తేది:28-03-2011)*

👉 కీమోథేరపీ, రేడియోథేరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండెజబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.*

👉 కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.*

 👉 రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.*
👉 (G.O.Ms.No.175 తేది:29-05-1997)*

👉 40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.*
👉 (G.O.Ms.No.105 తేది:09-04-2007)*

👉 మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.*
👉 (DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)*

👉 కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.*
👉 (G.O.Ms.No.87 తేది:28-02-2004)*

👉 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.*
👉 (G.O.Ms.No.601 M&H Dt: 15-10-2003)*

👉 నిర్ణీత పదవీ విరమణ వయస్సు పూర్తి చేసి (సూపరాన్యుయేషన్) పై రిటైరైన వారికి మాత్రమే రీయింబర్స్మంట్ సౌకర్యం వర్తింపచేసారు.నిర్బంధ పదవీ విరమణ,వాలంటరీ రిటైర్మెంట్, మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్మెంట్ పొందిన వారికి ఈ సౌకర్యం వర్తించదు*.
👉 (G.O.Ms.No.401 Dt: 25-06-1991)*

👉 హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.*

👉 రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No. 8878/D2-4/09 తేది:02-09-2009* ద్వారా వివరించారు.*

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS