Tuesday, 24 October 2017

Bumper Offer For TSPSC TRT -2017 All Districts Members Are Allowed To Open Competition



️ _*టీఆర్టీ అభ్యర్థులకు బంపర్‌ ఆఫర్‌...*_

*31 జిల్లాల ఓపెన్‌ మెరిట్‌కు అందరూ అర్హులే*

*మంచి మార్కులొస్తే మిగతా జిల్లాల్లో ‘20% మెరిట్‌కు అర్హత*

*964 ఎస్జీటీ ఇంగ్లిషు మీడియం సహా 8792 పోస్టులు*

*జిల్లాలవారీగా పోస్టుల భర్తీ.. గరిష్ఠంగా సంగారెడ్డిలో 903*

*30 నుంచి దరఖాస్తులు.. నవంబరు 30తో ఆఖరు*

*🖍నటిఫికేషన్‌ జారీ.. ఫిబ్రవరి రెండో వారంలో రాత పరీక్ష*

ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపి కబురు! వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో 8,792 పోస్టులతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) శనివారం టీఆర్టీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పోస్టులను 31 జిల్లాల వారీగా భర్తీచేయనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, సిలబస్‌, దరఖాస్తు గడువు తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 903 ఖాళీలు, అత్యల్పంగా 22 ఖాళీలు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఉన్నాయి. టీఆర్టీకి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 నుంచి నవంబరు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎ్‌సపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ జారీ అయినందున టీఆర్టీ అభ్యర్థులకు బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్టయింది. ఈ మేరకు జిల్లాతో నిమిత్తం లేకుండా ఓపెన్‌ మెరిట్‌ కోటాకు అర్హత సాధించే అవకాశం ఏర్పడింది. మంచి మార్కులు సాధిస్తే.. స్థానిక జిల్లాలో 80శాతం పోస్టులతో పాటు మిగతా 30జిల్లాల్లోని 20శాతం ఓపెన్‌ మెరిట్‌ కోటాకూ అర్హత సాధించవచ్చు. కాగా మొత్తం పోస్టుల్లో 5415 ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు 1941, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు 1011, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు 416, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు(పీడీ స్కూల్‌ అసిస్టెంట్‌) 9 ఉన్నాయి. పోస్టులను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో రాత పరీక్ష ద్వారా భర్తీచేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ఫిబ్రవరి 8,9,10 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని తాత్కాలిక షెడ్యూల్‌ను టీఎ్‌సపీఎస్సీ ఖరారు చేసింది. రాత పరీక్షకు 80శాతం, టెట్‌ వెయిటేజీకి 20శాతం మార్కులు కేటాయించారు. ప్రశ్నకు అర మార్కు చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పీడీ పోస్టులకు టెట్‌తో సంబంధం లేకుండా రాత పరీక్ష ఆధారంగానే భర్తీ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా జిల్లా పోస్టుల్లో 80శాతం స్థానికులతో, 20శాతం ఓపెన్‌ మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు. సిలబ్‌సలో కూడా మార్పులు లేవు. విద్యాశాఖ తెలంగాణ కోణంలో రూపొందించిన కొత్త పాఠ్యాంశాలు మినహా మిగతా అంతా పాత సిలబసే ఉంటుంది.

*మెరిట్‌ సాధిస్తే.. 31 జిల్లాల్లో ఎక్కడైనా*

డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ)ని రద్దు చేసి, టీఎ్‌సపీఎస్సీ ద్వారా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్టీ) నిర్వహిస్తుండడంతో అభ్యర్థులకు మేలు జరగనుంది. అత్యధిక మార్కులతో మెరిట్‌ సాధించిన అభ్యర్థులు సొంతజిల్లాతో నిమిత్తం లేకుండా 31 జిల్లాల ఓపెన్‌ మెరిట్‌ కోటాకు అర్హత సాధించే అవకాశం ఏర్పడింది. డీఎస్సీ విధానంలో సొంత జిల్లాకు మాత్రమే లోకల్‌, ఓపెన్‌ మెరిట్‌కు అర్హత లభించేది. సొంత జిల్లాలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటే కొందరు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలను ఎంపిక చేసుకుని నాన్‌లోకల్‌(ఓపెన్‌ మెరిట్‌) కోటాలో ఆప్షన్‌ ఇచ్చుకుని పరీక్ష రాసేవారు. దాంతో ఇతర జిల్లాలోని పోస్టుల సంఖ్యలో 20శాతానికి మాత్రమే అర్హత ఉండేది. అదే సమయంలో సొంత జిల్లా పోస్టులకు అర్హత లేకుండా పోయేది. ఫలితంగా సదరు అభ్యర్థి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. టీఆర్టీ ద్వారా ఈ బెడద తప్పనుంది. అభ్యర్థి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకున్నట్టయితే సొంత జిల్లాలోని 80శాతం పోస్టులతో పాటు ఆ జిల్లా ఓపెన్‌ మెరిట్‌ కోటాలోని 20శాతం పోస్టులకూ అర్హత సాధిస్తాడు. అలాగే మిగతా 30 జిల్లాల ఓపెన్‌ మెరిట్‌ కోటా 20శాతానికి కూడా అర్హత లభిస్తుంది. ఈ నిబంధన ద్వారా బాగా కష్టపడి చదివే వారికి గొప్ప అవకాశం ఇచ్చినట్టయిందని అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

*అర్హతలుంటే నాలుగు పరీక్షలు రాసుకోవచ్చు*

టీఆర్టీకి అర్హతలు ఉన్న అభ్యర్థులు 4 రకాల పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ చదివి ఉన్నట్టయితే స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ పండిట్‌, ఎస్‌జీటీ లాంగ్వేజ్‌ పండిట్‌ పరీక్షలు రాసేందుకు వీలుగా రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తేదీలు ఖరారు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.

* 🖍 కేజీ టు పీజీకి నాంది*

కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2016-17లో వెయ్యి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రారంభించింది. 2017-18 నాటికి వాటి సంఖ్య సుమారు 5 వేలకు చేరింది.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS